Site icon NTV Telugu

ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువ తీవ్రత తక్కువ : హరీష్‌ రావు

రోజురోజుకు తెలంగాణలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. కరోనా కేసుల వైద్యం కోసం అదనపు పడకలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా దాని తీవ్రత తక్కువేనని ఆయన తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చిన తట్టుకొనే విధంగా 1400 పడకలు హైద్రాబాద్ లో ఏర్పాటు చేశామన్నారు. నిలోఫర్‌లో 800 పడకలు ఏర్పాటు చేస్తున్నామని, మరో 6 ఆసుపత్రిలో 100 పడకలు చొప్పున ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

అందులో భాగంగా వనస్థలిపురంలో 100 పడకలు ఏర్పాడు చేశామన్నారు. అయితే అందరూ కోవిడ్ జాగ్రత్తలు పాటించి ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. 24 లక్షల హోమ్ ఐసోలాషన్ కిట్లను అందుబాటులో ఉంచుకున్నామని, పేదల వైద్యం మీదా ఎక్కువ ఖర్చు పెడుతున్న రాష్ట్రం తెలంగాణ అని కేంద్రం ప్రకటన చేసిందని ఆయన వెల్లడించారు. పేదలకు అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి సీఎం కేసీఆర్ ఆదేశాల ఇచ్చారని, ఫ్రూట్ మార్కెట్ వద్ద 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రానున్నట్లు దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని ఆయన తెలిపారు. మన బస్తీ దవాఖాన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మున్సిపాలిటీలో కూడా బస్తీ దవాఖానలు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. కోవిడ్ దృష్టిలో పెట్టుకొని అదనంగా వైద్యులను ఇక్కడ ఏర్పాటు చేసామని, రెండు డోస్‌లు కోవిడ్ వాక్సిన్ అందరూ తీసుకోవాలన్నారు. కొంచెం వ్యాధి లక్షణాలు ఉన్న పరీక్షలు చేసుకోవాలని సూచించారు.

Exit mobile version