NTV Telugu Site icon

పీయూష్ గోయల్ పై హ‌రీష్ రావు ఫైర్‌..క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే !

కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్ తెలంగాణ మంత్రి హ‌రీష్ రావు ఫైర్ అయ్యారు. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని హ‌రీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ‌ రాష్ట్ర మంత్రులు రైతుల పక్షాన ఢిల్లీ వ‌చ్చార‌ని… మంత్రులను కలిసేందుకు సమయం లేదు.. కానీ, బీజేపీ నేతలను మాత్రం కలుస్తారా? అని నిల‌దీశారు. రాజకీయం చేస్తున్నది బీజేపీ పార్టీ అని హరీష్‌రావు మండిప‌డ్డారు.

మంత్రులను పట్టుకొని పనిలేదని అంటారా? ఎంత ప్రాధాన్యత ఉంటే ఆరుగురు మంత్రులు ఢిల్లీకి వస్తారు..? అని నిల‌దీశారు. ఇంత దుర్మార్గంగా మాట్లాడే నైతికత మీకు ఎక్కడిది? ఇంతకైన హేయం ఏమైనా ఉంటుందా? అని పీయూష్ గోయ‌ల్ పై హరీష్‌రావు ఓ రేంజ్ లో రెచ్చి పోయారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు కేంద్రమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల ఓట్లు కావాలి కానీ, వడ్లు వద్దా అని ప్ర‌శ్నించారు. పంజాబ్ లో వడ్లు కొన్నపుడు.. తెలంగాణ వడ్లు ఎందుకు కొనరని హ‌రీష్ రావు నిల‌దీశారు.