Site icon NTV Telugu

ప్ర‌పంచాన్ని కంట‌త‌డి పెట్టిస్తున్న ఫొటో…

గ‌ల్ప్ దేశాల్లో ఒకటైన సిరియాలో చాలా కాలంగా ఉగ్ర‌వాదుల‌కు, ప్ర‌భుత్వ దళాలకు మ‌ధ్య అంతర్యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఈ అంతర్యుద్ధం కార‌ణంగా సామాన్యులు ఇబ్బందులు ప‌డుతున్నారు.  ఎప్పుడు ఎక్క‌డ ఎలాంటి పేలుళ్లు సంభ‌విస్తాయో అని బిక్కుబిక్కుమంటూ ఆందోళ‌న చెందుతున్నారు.  ఈ అంతర్యుద్ధం కార‌ణంగా ఇప్పటికే లక్షలాది మంది మృతి చెందారు.  వేలాదిమంది గాయపడ్డారు.  ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డిన‌వారు, సిరియా నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్రయత్నిస్తున్నారు.  ఇలా గాయపడిన వారిలో ముంజీర్ ఒక‌రు.  సిరియాలో జ‌రిగిన బాంబు దాడిలో త‌న కాలును పోగొట్టుకున్నాడు.  త‌న కుమారుడు ముస్త‌ఫా రెండు కాళ్లు లేకుండానే పుట్ట‌డం విశేషం.  తండ్రి ముజీర్ కాలు లేద‌ని బాధ‌ను ప‌క్క‌న పెట్టి రెండు కాళ్లు లేకుండా పుట్టిన ముస్త‌ఫాను ఆడిస్తూ, ప్రేమ‌ను పంచుతున్నాడు.  చిన్నారి ముస్త‌ఫాను ఎత్తుకొని ఆడిస్తున్న ఫొటో సియానా ఇంట‌ర్నేష‌న‌ల్ ఫొటో అవార్డుకు ఎంపికైంది.  అవార్డుకు ఎంపికైన ఈ ఫొటో నెటిజ‌న్ల‌కు ఆక‌ట్టుకోవ‌డ‌మే కాదు, కంటతడి కూడా పెట్టిస్తోంది. 

Read: కిమ్ సంచ‌ల‌న నిర్ణ‌యం: 2025 వ‌ర‌కు త‌క్కువగా తినండి…

Exit mobile version