వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్ మొదటిసారి 2009లో కడప పార్లమెంట్ నియోజక వర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. అయితే, 2009 సెప్టెంబర్ 2 వ తేదీన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత వైఎస్ జగన్ ఒదార్పు యాత్ర చేసేందుకు సంకల్పించారు. కాంగ్రెస్ పార్టీ అందుకు అనుమతించకపోవడంతో విభేదించి 2011, మార్చి 11 వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ పలు వ్యాపారాలు నిర్వహించేవారు. వ్యాపారవేత్తగా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే, 2009లో రాజకీయాల్లోకి వచ్చిన తరువాత పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోయారు.
Read: ప్రధాని మోడీకి పుతిన్ ఫోన్… దీనిపైనే చర్చ…
2011లో కడప పార్లమెంట్ నియోజక వర్గానికి జరిగిన ఎన్నికల్లో జగన్ భారీ మెజారిటితో విజయం సాధించారు. రాష్ట్ర విభజన చేయాలని నిర్ణయించినపుడు దాని వలన ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోతుందని తీవ్రంగా విభేదించి దీక్షలు చేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోయిన తరువాత ఏపీ రాజకీయాలపైనే వైఎస్ పూర్తి దృష్టి సారించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రతిపక్షంలో కీలక పాత్ర వహించింది.
Read: ఏపీ జగన్ బర్త్‌డే.. నగరిలో టెన్షన్ టెన్షన్..
రాష్ట్రవిభజనకు సంబంధించిన హామీలు, ప్రత్యేక హోదా తదితర హామీలను నెరవేర్చడంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలం కావడంతో వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను చేసి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. 2017 నవంబర్ 16న పాదయాత్రను ప్రారంభించి 2019 జనవరి 19న శ్రీకాకుళంలోని ఇచ్చాపురంలో పాదయాత్రను ముగించారు. ఈ పాదయాత్ర తరువాత జరిగిన ఎన్నికల్లో వైపీసీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయగా వైసీపీ 151 స్థానాల్లో విజయం సాధించింది.
