NTV Telugu Site icon

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగాలి : జీవీఎల్‌

అనంతపురం జిల్లాలో బీజేపీ శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో శిక్షణ తరగుతలలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగాలని అన్నారు. కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గానే గుర్తించిందని, అమరావతి రాజధానిగా కేంద్రం కూడా ఒప్పుకుందని ఆయన అన్నారు. రాయలసీమలోనే హైకోర్టు ను పెట్టండి అని చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే చెప్పామని, హైకోర్టు విషయం ఇప్పుడే తేలేలా లేదని ఆయన అన్నారు.

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టుకు మధ్య ఉన్న వ్తెరుధ్యం అందరికి తెలుసునని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రాయలసీమ నుంచే ఎక్కువ మంది సీఎం లు అయ్యారుని ఆయన తెలిపారు. ఇప్పటికి రాయలసీమ అందులోనూ అనంతపురం పూర్తిగా వెనుకబడి ఉన్నాయని, రాయలసీమ అభివృద్ధి కి బీజేపీ ప్రత్యేక కార్యాచరణ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అన్ని అవకాశాలు ఇచ్చినా ఏపీ ప్రభుత్వం వాడుకోవడం లేదని ఆయన ఆరోపించారు.