ఆదివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో గులాబ్ తుఫాన్ గోపాల్‌పూర్-కళింగపట్నం వద్ధ తీరం దాటింది. కళింగపట్నానికి 20 కిలోమీర్ల దూరంలో ఉత్తరభాగంలో తీరాన్ని దాటింది. తీరాన్ని దాటే సమయంలో 95 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచాయి. ఇక ఆదివారం ఉదయం నుంచే శ్రీకాకుళం జిల్లాలో వానలు దంచికొట్టాయి. కళింగపట్నం వద్ద తీరం దాటటంతో ఆ పట్టణం అతాకుతలం అయింది. ఆదివారం రోజున 19.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాతో పాటుగా విజయనగరం, విశాఖ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ ఈదురుగాలులు వీస్తుండటంతో అనేక ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంబాలు నేలకొరిగాయి. విజయనగరంలో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. అంతేకాదు, గజపతి నగరం, బొండపల్లి, దత్తిరాజేరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావం చేత సోమవారం రోజున కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచించారు. తీరప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Read: సెప్టెంబర్ 27, సోమవారం దినఫలాలు