Site icon NTV Telugu

గుజ‌రాత్ రాజ‌కీయం: స్పీక‌ర్ రాజీనామా… వెంట‌నే అమ‌ల్లోకి…

గుజ‌రాత్‌లో రాజ‌కీయాలు వేగంగా మారుతున్నాయి.  కొన్ని రోజుల క్రితం గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి విజ‌య్‌రూపానీ రాజీనామా చేశారు.  ఆయ‌న స్థానంలో బీజేపీ అధిష్టానం భూపేంద్ర పాటిల్‌ను ముఖ్య‌మంత్రిగా నియ‌మించింది.  కాగా రేపు భూపేంద్ర క్యాబినెట్ ప్ర‌మాణ ప్ర‌మాణ‌స్వీకారం ఉండ‌బోతున్న‌ది.  కాగా, ఈరోజు గుజ‌రాత్ అసెంబ్లీ స్పీక‌ర్ రాజేంద్ర త్రివేది రాజీనామా చేశారు.  ఆయ‌న త‌న రాజీనామా లేఖ‌ను  అసెంబ్లీ సెక్ర‌ట‌రీకి పంపారు.  స్పీక‌ర్ రాజీనామా వెంట‌నే అమ‌ల్లోకి వ‌చ్చిన‌ట్టు సెక్ర‌ట‌రి ప్ర‌క‌టించారు.  కొత్త అసెంబ్లీ స్పీక‌ర్ ఎవ‌రు అన్న‌ది త్వ‌ర‌లోనే తెలిపోనున్న‌ది.  రాజీవ్ త్రివేదీ రాజీనామాకు గ‌ల కార‌ణాలు ఎంటి అన్న‌ది తెలియాల్సి ఉన్న‌ది.  వచ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌గ‌బోతున్న త‌రుణంలో రాజీవ్ త్రివేదికి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌నున్నారా లేదంటే, స్పీక‌ర్‌గా కొత్త వారికి అవ‌కాశం క‌ల్పించేందుకే ఆయ‌న్ను ప‌క్క‌కు తప్పించారా అన్న‌ది తెలియాల్సి ఉన్న‌ది. 

Read: అంత‌రిక్షయానంలో స్పేస్ ఎక్స్ మ‌రో మైలు రాయి…

Exit mobile version