Site icon NTV Telugu

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : మొక్కలు నాటిన మంత్రి హరీశ్ రావు

ముఖ్యమంత్రి కేసీఆర్ హరిత తెలంగాణ స్వప్నం సాకారం కోసం.. రాష్ట్రంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంకల్పం గొప్పదని హరీశ్ రావు అన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా మంత్రి హరీశ్ రావు సిద్దిపేటలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి ప్రకోపిస్తే అల్లకల్లోలమే జరుగుతుందనీ, దాన్ని నివారించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఎంపీ సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టి మొక్కలు నాటుతూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయమని మంత్రి హరీశ్ రావు అన్నారు. సంతోష్ చేస్తున్న కృషికి తాను మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపీ సంతోష్ కోరినట్లుగానే తన అనుచరులు, అభిమానులు కూడా తమవంతుగా మొక్కలు నాటి, గ్రీన్ ఇండియా సంకల్పాన్ని సక్సెస్ చేస్తారని మంత్రి హరీశ్ అన్నారు.

Exit mobile version