NTV Telugu Site icon

MK Stalin Urges : గవర్నర్‌ వర్సెస్ సర్కార్.. బీజేపీయేతర రాష్ట్రాలకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి

Mk Stalin

Mk Stalin

దేశంలో బీజేపీయేతర రాష్ట్రాల్లో గర్నవర్ల వర్సెస్ ప్రభుత్వాలు అన్నట్లు సాగుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో తెలగాంణ, తమిళనాడు కేరళ లాంటి రాష్ట్రాలు గవర్నర్ వ్యవస్థపై తీవ్రం మండిపడుతున్నాయి. రాజ్ భవన్ ను రాజకీయ భవన్ గా మార్చారంటూ ఆయా రాష్ట్రాలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో ఆమోందించిన బిల్లలను గవర్నర్లు ఆమోందించకుండా కాలయాపన చేయండపై తీవ్ర అభ్యంతరం వ్యక్తి చేస్తున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇటివల గవర్నర్ల తీరుకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం కూడా చేశారు. గవర్నర్లు బిల్లులు ఆమోదించడానికి కాలపరిమితి నిర్ణయించాలంటూ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతిని కోరారు. తాజా ఇదే అంశంపై ఇతర రాష్ట్రాల మద్దతు కూడా కోరుతున్నారు.

Also Read:Balineni Srinivasa Reddy: మళ్లీ అలిగిన బాలినేని… సీఎం జగన్‌ బుజ్జగింపులు
శాసనసభలు ఆమోదించిన బిల్లులను ఆమోదించడానికి గవర్నర్‌లకు కాలపరిమితిని నిర్ణయించాలని కేంద్రాన్ని కోరుతూ తమ తమ అసెంబ్లీలలో తీర్మానాలు ఆమోదించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ బిజెపియేతర రాష్ట్రాలను కోరారు. బిల్లులకు సంబంధించిన అంశాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్తంభించిపోయాయని తెలిపారు.ఈ సమస్యకు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలిస్తే, గవర్నర్ ఆర్ ఎన్ రవి ఆమోదం కోసం పంపిన బిల్లులపై ఆయన లేవనెత్తిన సందేహాలు మరియు ఆందోళనలను నివృత్తి చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది.

అనేక ఇతర రాష్ట్రాలకు గవర్నర్ల తీరుతో ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు. గవర్నర్‌లకు కాలపరిమితిని నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, భారత రాష్ట్రపతిని కోరుతూ తమ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడం సరైనదని భావించామన్నారు. సంబంధిత చట్టసభలు ఆమోదించిన బిల్లులను ఆమోదించాలని అని స్టాలిన్ అన్నారు.

Also Read:MLA Seethakka : మోడీ 10 లక్షల షూట్ వేసుకుంటాడు.. రాహుల్ కి ఇల్లే లేదు
ఏప్రిల్ 10న తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం కాపీని కూడా జత చేశారు. తనకు మద్దతును అందిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. మీ రాష్ట్ర అసెంబ్లీలో ఇదే విధమైన తీర్మానాన్ని ఆమోదించాలని స్టాలిన్ కోరారు. రాజ్యాంగం గవర్నర్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్రలు, బాధ్యతలను స్పష్టంగా నిర్వచించింది. అయితే, ఆ సూత్రాలను ఇప్పుడు గౌరవించడం లేదా పాటించడం లేదని గమనించామన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ప్రభావితం చేస్తుందని ఆయన అన్నారు. భారత ప్రజాస్వామ్యం ఒక కూడలిలో ఉందన్నారు. దేశ పాలన నుండి సహకార సమాఖ్య స్ఫూర్తి క్షీణించడాన్ని మనం ఎక్కువగా చూస్తున్నామని స్టాలిన్ వ్యాఖ్యానించారు.