NTV Telugu Site icon

మ‌హిళ‌లకు గుడ్ న్యూస్‌: త‌గ్గిన పుత్త‌డి ధ‌ర‌లు

నిన్న‌టి రోజున భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు ఈరోజు తిగిరి తగ్గుముఖం ప‌ట్టాయి. బంగారం ధ‌ర‌లు దిగి వ‌స్తున్న‌ప్ప‌టికీ, వెండి మాత్రం పెరుగుతూనే ఉన్న‌ది.  త‌గ్గిన ధ‌ర‌ల ప్ర‌కారం న‌గ‌రంలోని బులియ‌న్ మార్కెట్లో పుత్త‌డి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 150 త‌గ్గి రూ.43,200కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 160 త‌గ్గి రూ.47,130 కి చేరింది.  ఇక కిలో వెండి ధ‌ర రూ.300 పెరిగి రూ.64,700కి చేరింది.  అంత‌ర్జాతీయంగా బంగారం ధ‌ర‌లు కొంత‌మేర త‌గ్గ‌డంతో దేశీయంగా పుత్త‌డి ధ‌ర‌లు దిగివ‌స్తున్నాయి.  అదే విధంగా దీశీయంగా మార్కెట్లు బ‌లం పుంజుకోవ‌డం కూడా బంగారం ధ‌ర‌లు దిగిరావ‌డానికి ఒక కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు.  

Read: క‌రోనాకు అంతం ఎప్పుడు?