కరోనా కాలంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వరసగా బంగారం ధరలు పెరుగుతుండటంతో పుత్తడిని కొనుగోలు చేయాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా చాలామంది బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతుండటంతో ధరలు భారీగా పెరుగుతున్నాయి. అయితే, ఈరోజు బంగారం ధరలు ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,450 వద్ద ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,590 వద్ద ఉన్నది. కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో బంగారం ధరలు ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నాయి. ఒకవేళ కేసులు పెరిగి లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు జరుగుతూనే ఉంటె ధరలు మళ్ళీ పెరిగే అవకాశం లేకపోలేదు.
నిలకడగా బంగారం ధరలు… మళ్ళీ పెరుగుతాయా?
