NTV Telugu Site icon

Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధర

Gold

Gold

బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే, ఇది మీకు గుడ్ న్యూస్. బంగార ఆభరణాలంటే స్త్రీలకు అమితమైన ప్రేమ ఉంటుంది. దేశంలో బంగారం ధర కాస్త తగ్గింది. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. అయితే, వెండి మాత్రం మళ్లీ భారీగా పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీసహా తెలుగురాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read:Realme C33: అద్భుత ఫిచర్స్ తో రియల్‌మీ స్మార్ట్ ఫోన్.. ధర తక్కువే!

హైదారాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.100 మేర తగ్గింది. ప్రస్తుతం తులానికి హైదరాబాద్‌లో రూ.53,050 వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గి.. రూ.57,870కి చేరింది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,870గా ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,870గా ఉంది.
Also Read:MLC Eelctions: నేడు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. అభ్యర్థుల్లో టెన్షన్

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం తులానికి రూ.100 మేర తగ్గింది.దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.53, 200గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 మేర తగ్గి రూ.58, 020 వద్ద ఉంది. ఇక వెండి మాత్రం మళ్లీ భారీగా పెరిగింది. ఇవాళ ఒక్కరోజే కిలో వెండి ధర రూ.500 మేర పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.72, 500కి చేరింది. ఇక ఢిల్లీలో కిలో వెండి ధర రూ.500 పెరిగి ప్రస్తుతం రూ.69 వేలగా పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,690గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.53,050 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.57,870గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.53,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,920గా ఉంది. ఇటీవల వరసుగా పెరిగిన పసిడి మళ్లీ తగ్గటం ఊరట కలిగిస్తోంది. పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో బంగారం ధర తగ్గటంతో పసిడి ప్రియులకు బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Show comments