బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ సమయంలో కరోనా కేసులతో పాటుగా ధరలు కూడా పెరుగుతున్నాయి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 పెరిగి రూ.45,450కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.330 పెరిగి రూ. 49,590కి చేరింది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు.
బంగారానికి మళ్ళీ రెక్కలు… చుక్కల్లో ధరలు
