Site icon NTV Telugu

Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold

Gold

మీరు విలువైన బంగారు, వెండి ఆభరణాలను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, ఈ రోజు మీరు ఎక్కువ ఖర్చు చేయవలసి ఉంటుంది. గత కొద్ది రోజులుగా బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కొనసాగుతున్నాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. గురువారం (ఏప్రిల్ 13) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,310గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ. 500, 24 క్యారెట్లపై రూ.550 పెరిగింది. ఇక, కిలో వెండి ధర ఏకంగా రూ.750 పెరిగి రూ.77,350కి చేరుకుంది.

Also Read:Rain in Andhra Pradesh: ఏపీలో భిన్నవాతావరణం.. మూడు రోజులు వర్షాలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,200 కాగా, 24 క్యారెట్ల ధర రూ.61,310గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,310గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,310గా ఉంది.

Also Read:Karnataka Elections: బీజేపీ మాస్టర్ ప్లాన్.. డీకే శివకుమార్, సిద్ధరామయ్యలకు చెక్ పెట్టేలా స్కెచ్..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,350 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,460గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.61,310.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,800 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.61,960గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,310గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,250 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,360గా నమోదైంది.

Exit mobile version