సిద్ధిపేట జిల్లాలోని కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా స్వామి వారి కల్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది. ప్రభుత్వం తరుపున స్వామి వారికి పట్టువస్త్రాలను ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు సమర్పించారు. ఈ కల్యాణోత్సవ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు కూడా హజరయ్యారు. మల్లన్న స్వామి కల్యాణోత్సవంతో నేటి నుంచి కొమురవెల్లిలో మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.