NTV Telugu Site icon

గ్లోబ‌ల్ వార్మింగ్‌: ఆ దేశం క‌నుమ‌రుగౌతుందా?

గ్లోబ‌ల్ వార్మింగ్ ఈ పేరు వింటే ప్ర‌పంచం ఒడ‌లు వ‌ణికిపోతున్నాయి.  గ్లోబ‌ల్ వార్మింగ్ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌పంచ‌దేశాలు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యం కార‌ణంగా స‌ముద్రంలోని నీటి మ‌ట్టాలు పెరుగుతున్నాయి.  స‌ముద్ర మట్టం పెర‌గ‌డం వ‌ల‌న తీర ప్రాంతాల్లో ఉండే చిన్న చిన్న దీవులు, దేశాలు ఇబ్బందుల్లో ప‌డుతున్నాయి.  ప‌సిఫిక్ మ‌హాస‌ముద్రంలో ఉన్న తువాలు దేశం గ్లోబ‌ల్ వార్మింగ్ కార‌ణంగా ఇబ్బందులు ప‌డుతున్న‌ది.  ఈ దేశంలోని కొన్ని దీవులు ఇప్ప‌టికే నీట మునిగాయి.  

Read: పాత రోజుల్లోకి ప్ర‌పంచం…

గ్లోబ‌ల్ వార్మింగ్ ఇలానే పెరిగిపోతే దాని వ‌ల‌న ఆ దేశం మొత్తం మునిగిపోయే అవ‌కాశం ఉన్న‌ది. కాప్ 26 స‌ద‌స్సులో గ్లోబ‌ల్ వార్మింగ్‌పైనే పూర్తిస్థాయి చ‌ర్చ జ‌రిగింది.  కాలుష్యాన్ని నివారించే చ‌ర్య‌లు, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై చ‌ర్చించారు.  తువాలు మంత్రి స‌ముద్రం నీటిలో నిల‌బ‌డి కాప్ 26 స‌ద‌స్సును ఉద్దేశించి మాట్లాడ‌టం సంచ‌ల‌నంగా మారింది.  తువాలు దేశ భ‌విష్య‌త్తు ప్ర‌పంచ దేశాలపై ఆధార‌ప‌డి ఉందని, గ్లోబ‌ల్ వార్మింగ్‌ను త‌గ్గించ‌గ‌లిగితే తువాలు సుర‌క్షితంగా ఉంటుంద‌ని  నిపుణులు చెబుతున్నారు.