గ్లోబల్ వార్మింగ్ ఈ పేరు వింటే ప్రపంచం ఒడలు వణికిపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ నుంచి బయటపడేందుకు ప్రపంచదేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యం కారణంగా సముద్రంలోని నీటి మట్టాలు పెరుగుతున్నాయి. సముద్ర మట్టం పెరగడం వలన తీర ప్రాంతాల్లో ఉండే చిన్న చిన్న దీవులు, దేశాలు ఇబ్బందుల్లో పడుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న తువాలు దేశం గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇబ్బందులు పడుతున్నది. ఈ దేశంలోని కొన్ని దీవులు ఇప్పటికే నీట మునిగాయి. …