NTV Telugu Site icon

జీహెచ్ఎంసీ కీల‌క హెచ్చ‌రిక‌: అవ‌స‌ర‌మైతే త‌ప్పా బ‌య‌ట‌కు రావొద్దు…

నిన్న రాత్రి న‌గ‌రంలో భారీ వ‌ర్షం కురిసింది.  ఈ వ‌ర్షం ధాటికి రోడ్లు చెరువుల్లా మారిపోయాయి.  రోడ్ల‌పైకి వ‌ర‌ద‌నీరు వ‌చ్చి చేరింది.  ఇక లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి.  నిన్న‌టి వ‌ర్షం నుంచి ఇంకా కోలుకోక ముందే జీహెచ్ఎంసీ అధికారులు మ‌రో కీల‌క సూచ‌న‌లు చేశారు.  ఈరోజు మ‌ధ్యాహ్నం నుంచి న‌గ‌రంలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని, భారీ వ‌ర్షాల దృష్ట్యా ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్పా బ‌య‌ట‌కు రావొద్ద‌ని జీహెచ్ఎంసీ హెచ్చ‌రించింది. ప్ర‌జ‌ల స‌హాయం కోసం హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.  అత్య‌వ‌స‌ర‌మైతే 040 2111 1111నెంబ‌ర్‌ను సంప్ర‌దించాల‌ని అధికారులు తెలిపారు.  ఇక ఈనెల‌లో మ‌రో రెండు తుఫానులు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్టుగా భార‌త వాతావ‌ర‌ణ శాఖ ముందుగానే హెచ్చ‌రించింది. ఈనెల 14, 21 త‌రువాత తుఫానులు వ‌స్తాయ‌ని తెలియ‌జేసింది.  

Read: హుజురాబాద్‌: కాంగ్రెస్ క్యాంపైన‌ర్స్ జాబితా విడుద‌ల‌