హుజురాబాద్‌: కాంగ్రెస్ క్యాంపైన‌ర్స్ జాబితా విడుద‌ల‌

హుజురాబాద్ ఉప ఎన్నిక వేడి పెరిగింది.  నామినేష‌న్ల ప‌ర్వం ముగియ‌డంతో క్యాంపెయిన్లు మొద‌లయ్యాయి. ఇప్ప‌టికే టీఆర్ఎస్, బీజేపీలు హుజురాబాద్‌లో ప్రచారం మొద‌లుపెట్ట‌గా, కాంగ్రెస్ పార్టీ కూడా ప్ర‌చారం చేసేందుకు స‌ర్వం సిద్ధం చేసుకుంటోంది.  కాంగ్రెస్ పార్టీ 20 మందితో కూడిన క్యాంపెన‌ర్ల జాబితాను రిలీజ్ చేసింది.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌, పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి, భ‌ట్టి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, జీవ‌న్ రెడ్డి, శ్రీధ‌ర్‌బాబు, దామోద‌ర రాజ‌న‌ర్సింహా, మ‌ధుయాష్కీ త‌దిత‌రులు ఈ క్యాంపైన‌ర్ల జాబితాలో ఉన్నారు.  గ‌త ఎన్నిక‌ల్లో హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ బ‌ల‌మైన మెరుగైన ఓటు బ్యాంకును సాధించింది.  అయితే, ఈసారి అంత‌కు మించి ఓటు బ్యాంకు సాధించడ‌మే ల‌క్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్ర‌చారం చేయ‌బోతున్న‌ది.  అధికార టీఆర్ఎస్ పార్టీని ల‌క్ష్యంగా చేసుకొని విమ‌ర్శ‌లు చేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధం అవుతున్నారు.  

Read: 17 ఏళ్లుగా అడవిలో ఒంట‌రిగా… ఇదే కార‌ణం…

-Advertisement-హుజురాబాద్‌:  కాంగ్రెస్ క్యాంపైన‌ర్స్ జాబితా విడుద‌ల‌

Related Articles

Latest Articles