Site icon NTV Telugu

వైకుంఠ ఏకాదశి లోపు తిరుమల ఘాట్ రోడ్డు పనులు పూర్తి

వైకుంఠ ఏకాదశిలోపు ఘాటు రోడ్ పనులు పూర్తిచేస్తామంటోంది టీటీడీ. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామంటోంది. తుఫాన్ కారణంగా ఏర్పడిన భారీ వర్షాలకు ఘాట్ రోడ్డు పాడైంది. తిరుమల రెండో ఘాట్‌ మరమ్మతులు ఈ నెలాఖరులోపు పూర్తిచేసి, వైకుంఠ ఏకాదశిలోపు వాహన రాకపోకలకు అనుమతివ్వాలని ఇంజనీరింగ్‌ అధికారులను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. 7,8,9,14,15వ కిలోమీటర్ల వద్ద త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ఐఐటీ నిపుణుల సూచనలతో ఇంకా బండరాళ్లు పడే ప్రాంతాలను గుర్తించి, జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

Exit mobile version