NTV Telugu Site icon

Atiq Ahmed’s Killers: మరో జైలుకు గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ హంతకులు

Atiq

Atiq

సంచలన సృష్టించిన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌లను కాల్చి చంపిన వ్యక్తులను భద్రతా కారణాల దృష్ట్యా ఉత్తరప్రదేశ్‌లోని మరొక జైలుకు తరలించారు. నిందితులు సన్నీ సింగ్, అరుణ్ మౌర్య, లవలేష్ తోవారీ ముగ్గురిని మునుపటి నైనీ జైలు నుండి ప్రతాప్‌గఢ్ జైలుకు తరలించారు. నైని జైలులో ముగ్గురిపై దాడి జరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అహ్మద్ ముఠాను నిర్మూలించడం ద్వారా తమకంటూ ఒక పేరు తెచ్చుకోవాలని భావిస్తున్న ముగ్గురు వ్యక్తులు వారాంతంలో కోర్టులో హాజరుపరిచిన తర్వాత 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. హత్యలపై నివేదిక సమర్పించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు సభ్యుల న్యాయ విచారణ కమిటీకి రెండు నెలల గడువు ఇచ్చింది.
Also Read: ISIS terrorist : సిరియన్ ఎడారిలో ఐసిస్ కిరాతకం.. 31 మంది పౌరులు హతం

ఈ నెల 12న ఝాన్సీ జిల్లాలో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కుమారుడు అసద్ అహ్మద్ హతమైన కొద్ది రోజుల తర్వాత అతిక్,అష్రఫ్‌ల హత్య జరిగింది. పోలీసులు ఎస్కార్ట్‌గా తీసుకువెళుతుండగా వారిని హతమార్చారు. దుండగులు జర్నలిస్టులుగా నటించారు. హత్యానంతరం ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేసి లొంగిపోయారు. కాల్పులు జరిపిన వారి నుంచి మూడు నకిలీ మీడియా ఐడీ కార్డులు, మైక్రోఫోన్, కెమెరాను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన అనంతరం పోలీసులకు లొంగిపోయి అరెస్టు చేశారు. లవ్లేష్ కాలుకు బుల్లెట్ ఒకటి తగిలి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.