ఖమ్మం ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థిగా తాతా మధుకు సంబంధించిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు అందరినీ గోవా క్యాంప్ కు తరలించారు. గత వారం రోజులుగా 470 మంది ఓటర్లు వారితోపాటు వారి బంధువులు అంతా గోవాలో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. గోవాలో డ్యాన్సులతో మారుమోగుతున్న వీడియోలను ఎప్పటికప్పుడు ఎన్టీవీ అందించింది.
అయితే ఈ నెల పదో తారీఖున ఓటింగ్ ఉండటంతో అక్కడ ఉన్న ఓటర్లను ముందుగా హైదరాబాద్ కి తరలిస్తున్నారు. ప్రస్తుతతం గోవాలో ఉన్న ఓటర్లు హైదరాబాద్ కి బయలుదేరారు. మళ్లీ హైదరాబాద్ లో రెండు రోజుల పాటు అంటే 9 వ తేదీ వరకు క్యాంపు ఏర్పాటు చేసి అక్కడ మాక్ పోలింగ్ ను టీఆర్ఎస్ నేతలు నిర్వహించనున్నారు.
