Site icon NTV Telugu

Imran Khan: లాహోర్‌ కోర్టుకు పాకిస్థాన్ మాజీ ప్రధాని.. ఇమ్రాన్ తలకు బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్

Imran

Imran

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కట్టుదిట్టమైన భద్రత మధ్య లాహోర్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టుకు చేరుకున్నారు. అయితే, మాజీ ప్రధాని తలపై ధరించే విచిత్రమైన బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. మరోసారి ఆయన హత్యాయత్నం జరిగే అవకాశం ఉండడంతో ఇమ్రాన్‌ ఖాన్‌కు భద్రతా పెంచారు. బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్స్ ఏర్పాటు చేయడమే కాకుండా అసాధారణమైన రక్షణ శిరస్త్రాణం ధరించాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో బయటకొచ్చింది.
Also Read: MLA Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

ఇమ్రాన్‌ లాహోర్ కోర్టు వైపు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు అతని కమాండోలు నల్ల బుల్లెట్-రెసిస్టెంట్ షీల్డ్‌లతో అతనిని చుట్టుముట్టినట్లు వైరల్ అయిన వీడియో చూపించింది. అతని ముఖం మొత్తం నల్లటి తలపాగాతో కప్పబడి ఉండటంతో ఇద్దరు వ్యక్తులు అతని చేతులు పట్టుకుని కోర్టు వైపు నడిపించడం కనిపించింది. ఆయన కోర్టుకు హాజరైన తర్వాత, ఇమ్రాన్‌ ఖాన్‌కు లాహోర్ యాంటీ టెర్రరిజం కోర్టు మూడు కేసుల్లో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అతడి బెయిల్‌ను ఏప్రిల్ 13 వరకు పొడిగించారు. జిల్లే షా హత్య కేసు, దహనం, రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వంటి మూడు సందర్భాల్లో PTI చైర్మన్ బెయిల్ కోరుతూ కోర్టుకు హాజరయ్యారు.

Also Read:Stormy Daniels: ట్రంప్‌కు లీగల్ ఫీజు చెల్లించండి.. డేనియల్స్‌కు కోర్టు ఆదేశం

కాగా, 2022 నవంబర్‌లో పంజాబ్‌లోని వజీరాబాద్‌లో ప్రసంగిస్తున్నప్పుడు హత్యాయత్నం నుండి తప్పించుకున్నారు. కంటైనర్‌లో అమర్చిన ట్రక్కుపై సాయుధుడు కాల్పులు జరపడంతో అతని కాలుకు గాయమైంది. కొన్ని రోజుల క్రితం, అతను దాడి గురించి మాట్లాడాడు. కుడి కాలు దీర్ఘకాలంగా దెబ్బతింటుందని వెల్లడించాడు. బుల్లెట్ గాయాల కంటే నరాల దెబ్బతినడం వల్ల తనకు ఎక్కువ సమస్యలు వచ్చాయని తెలిపారు.

ఇదిలా ఉంటే.. ఇమాన్ కోర్టు వచ్చిన సందర్భంలో ఉన్న భద్రతపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. సోషల్ మీడియాలో చాలా మంది బుల్లెట్‌ప్రూఫ్ ‘బకెట్’ని ఎగతాళి చేశారు. అలాంటి భద్రతా చర్యల పనితీరు గురించి జోకులు పేల్చారు. ”ఇది నేను చూసిన అత్యంత తెలివితక్కువ రకమైన భద్రత” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

Exit mobile version