Site icon NTV Telugu

అక్క‌డ రంగంలోకి ఆర్మీ… వారంలో అన్నిరోజులూ వ్యాక్సినేష‌న్‌…

ప్ర‌పంచం మొత్తంమీద ప్ర‌స్తుతం క‌రోనాతో అత్యంత ఇబ్బందులు ప‌డుతున్న దేశం ఏంట‌ని అంటే బ్రిట‌న్ అని ట‌క్కున చెప్పేస్తున్నారు.  సౌతాఫ్రికాలో మొద‌లైన ఒమిక్రాన్ వేరియంట్‌లు ఇప్పుడు అత్య‌ధికంగా బ్రిట‌న్‌లోనే క‌నిపిస్తున్నాయి.  రోజుకు వంద‌ల సంఖ్య‌లో ఈ వేరియంట్ కేసులు న‌మోద‌వుతున్నాయి.  దీంతో ఆ దేశం అప్ర‌మ‌త్తం అయింది.  గ‌తంలో విధించిన లాక్‌డౌన్ ల దెబ్బ‌కు ఆర్థికంగా కుదేలైంది.  ప్ర‌జ‌లను మ‌హమ్మారుల నుంచి బ‌య‌ట‌ప‌డేసేందుకు ప్ర‌స్తుతం ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్న‌ది.  

Read: యూర‌ప్‌ను వ‌ణికిస్తున్న ఒమిక్రాన్‌… ఫ్రాన్స్‌లో ఆరోవేవ్‌…

ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా మాస్క్ ధ‌రించాల‌ని, వీలైనంత వ‌ర‌కు ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రాకుండా ఉండాల‌ని, అవ‌స‌ర‌మైతే వ‌ర్క్‌ఫ్ర‌మ్ హోమ్‌ను చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తూ వ‌స్తున్న‌ది.  బ్రిట‌న్‌లో 40 ఏళ్ల‌కు పైబ‌డిన వారికి బూస్ట‌ర్ డోసులు అందిస్తున్నారు.  ఈరోజు నుంచి దేశ‌వ్యాప్తంగా 30 ఏళ్ల‌కు పైబ‌డిన వారికి బూస్ట‌ర్ డోసులు అందించేందుకు బ్రిట‌న్ అధికారులు సిద్ద‌మ‌వుతున్నారు.  దీనికోసం ఆర్మీని వినియోగించుకోనున్న‌ట్టు బ్రిట‌న్ ప్ర‌భుత్వం తెలియ‌జేసింది.  ఆర్మీ నేతృత్వంలో వారంలో అన్ని రోజులూ బూస్ట‌ర్ డోసుల‌ను అందించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.  

Exit mobile version