దేశవ్యాప్తంగా విషాదం నింపిన హెలికాప్టర్ ప్రమాదానికి పొగమంచే కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మూడురోజుల నుంచి ఈ మార్గంలో ట్రయల్ రన్ నడుస్తోంది. సంజప్పన్ క్షత్తిరం గ్రామంలో కాలిపోతూ కుప్పకూలింది మిలటరీ హెలికాప్టర్. బుధవారం మధ్యాహ్నం 12.20 నిమిషాలకు ఈ ఘటన చోటుచేసుకుంది. కాతేరీ పార్క్ లో ఈ హెలికాప్టర్ కుప్పకూలింది.
నీలగిరి ప్రాంతంలో సాధారణంగా పొగమంచు ఎక్కువగా వుంటుంది. దీంతో హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. స్థానికులు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కాసేపట్లో వెల్లింగ్ టన్ చేరాల్సిన హెలికాప్టర్ తీవ్రమయిన ప్రమాదానికి గురికావడం విషాదం నింపింది. మిలటరీ విచారణలో మరిన్ని విషయలు బయటపడనున్నాయి.