దేశంలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. వర్షాలు బీహార్ రాష్ట్రాన్ని ముంచెత్తాయి. దీంతో సామాన్యప్రజలతో పాటుగా విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా గత విద్యాసంవత్సంలో పాఠశాలలు జరగలేదు. గత నెల రోజుల నుంచి పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. స్కూళ్లు ప్రారంభమైన కొన్ని రోజులకే వరదలు ముంచెత్తడంతో ఉపాద్యాయులు పడవల్లోనే పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. కతియార్ జిల్లాలోని మహనీహరి ప్రాంతంలో ఉపాద్యాయులు పడవల్లోనే విద్యను బోధిస్తున్నారు. కరోనా కారణంగా ఇప్పటికే విద్యకు విద్యార్థులు దూరం అయ్యారని, ఇప్పుడు వరదల కారణంగా విద్యకు విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ విధంగా పడవల్లో విద్యను బొధిస్తున్నట్టు పంకజ్ కుమార్ అనే ఉపాద్యాయుడు పేర్కొన్నారు.
వరదల ఎఫెక్ట్: పడవలపైనే విద్యాబోధన…
