NTV Telugu Site icon

గన్నవరంలో దిగాల్సిన విమానం మళ్లింపు.. ఎందుకంటే..?

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకు గ్రామల నుంచి పట్టణాల వరకు అన్ని చోట్ల రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పూట పొగమంచు కారణంగా రోడ్లపై వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై వెళ్లే వారికే కాకుండా విమానాల రాకపోకలకు సైతం ఇబ్బంది నెలకొంది. తాజాగా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఈ రోజు ఉదయం ఎయిర్‌ఇండియా సంస్థకు చెందిన ఓ విమానం ల్యాండ్‌ అవ్వాల్సి ఉంది.

అయితే ల్యాండింగ్‌ సమయంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ రన్‌పై మొత్తం దట్టమైన పొగమంచు ఉండడంతో విమానం ల్యాండింగ్‌ అయ్యే సమయంలో పైలట్‌ మళ్లీ టేకాఫ్ చేశాడు. దీంతో రన్‌వేపై దిగేందుకు వీలులేక గాలిలోనే విమానం కొంతసేపు చక్కర్లు కొట్టింది. దీంతో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ఆ విమానాన్ని హైదరాబాద్‌కు మళ్లించారు.