Site icon NTV Telugu

స్కార్పియోలో మంటలు.. తప్పిన ప్రమాదం

ఈమధ్యకాలంలో కార్లలో మంటలు తీవ్ర ప్రమాదాలను తెచ్చిపెడుతున్నాయి. రోడ్ల మీద, హైవేల మీద వెళుతున్న వాహనాల్లో అకస్మాత్తుగా మంటలు వ్యాపిస్తున్నాయి. కొంతమంది దురదృష్టవశాత్తూ కొందరు సజీవ దహనం అయిపోతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం తప్పిపోయింది. రామచంద్రాపురం బీహెచ్ఈఎల్ చెక్ పోస్ట్ వద్ద స్కార్పియో వాహనంలో ఒక్కసారి మంటలు చెలరేగాయి.

అయితే ప్రమాదం పసిగట్టడంతో వాహనం నుంచి బయటపడ్డారు. ప్రమాదం జరిగే సమయానికి వాహనంలో ఇద్దరు ప్రయాణికులు వున్నారు. వారంతా బయట పడడంతో తృటిలో తప్పింది ప్రమాదం, స్కార్పియో వాహనంలో ఇద్దరు ప్రయాణికులు సురక్షితంగా వున్నారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు బేంబేలెత్తిపోయారు. ప్రమాదం వార్త తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఆర్పివేశారు. స్కార్పియో వాహనం సగానికి పైగా కాలిపోయింది. ప్రాణ నష్టం కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మంటలకు గురైన వాహనం నెంబర్ ఏపీ 28 బీఎఫ్ 6099 గా తెలుస్తోంది.ప్రమాదం వల్ల ఆ ప్రాంతంలో కాసేపు వాహనాలు నిలిచిపోయాయి.

Exit mobile version