నకిలీ ఇన్స్యూరెన్స్‌ల దందా..10మందిపై కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అవకాశం చిక్కితే అడ్డంగా దోచేందుకు కొందరు కేటుగాళ్ళు రెడీ అయిపోతున్నారు. వరంగల్ జిల్లాలో ఓ ముఠా నకిలీ ఇన్స్యూరెన్స్‌ల పేరిట భారీగా మోసాలకు పాల్పడింది. ఆర్టీఏ కార్యాలయంలో నకిలీ ఇన్స్యూరెన్సుల దందా వెలుగులోకి వచ్చింది. తీగ లాగిన పోలీసులు పలు అంశాలు వెలుగులోకి తెచ్చారు. ఆర్టీఏ కార్యాలయం పరిసర ప్రాంతాలలో దళారులుగా పనిచేస్తూ నకిలీ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు తయారుచేశారు. మోసాలకు పాల్పడ్డారు. ఈ దందాలో ప్రమేయం వున్న 10 మందిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేశారు.
నకిలీ వాహన బీమా పాలసీలు చేసే ముఠా గుట్టు రట్టు చేశారు వరంగల్ పోలీసులు. దీనికి సంబంధించి రెండు ముఠాలకు చెందిన ఇద్దరు దళారులతోపాటు 10 మందిని అరెస్టు చేశారు. మొబైల్ యాప్ ద్వారా డాక్యుమెంట్లు డౌన్ లోడ్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా దొరకకుండా ఫేక్ బీమా పాలసీలు, వాహన రిజిస్ట్రేషన్, లైసెన్స్ తయారు చేస్తారు.
Also Read
- WMO Warning: ప్రమాదకర ఎల్‌నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- Marco Rubio: ఇరాన్ అణు చర్చలపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు.. పశ్చిమాసియా శాంతించేనా?
- G Parameshwara: పరమేశ్వరకు లక్కీ ఛాన్స్.. కొత్త ప్రభుత్వంలో కీలక పదవి!
- US: అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్‌గా విలియం జె.పుల్టే నియామకం.. ట్రంప్ అభినందనలు
ఈవిధంగా రెండేళ్లలో 90 లక్షల రూపాయల విలువ చేసే 2 వేల నుంచి పది వేల డాక్యుమెంట్లు తయారు చేశారు. అయితే వీరి బారిన పడి మోసపోయిన వాహనదారుడి ఫిర్యాదుతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుల కార్యాలయాలపై దాడులు నిర్వహించడంతో పది మంది పట్టుబడ్డారని సీపీ తరుణ్ జోషి తెలిపారు. నిందితుల నుంచి 4లక్షల 46వేల రూపాయల నగదు, 3 ల్యాప్ టాప్ లు, 2 డెస్క్ టాప్ కంప్యూటర్లు, 4 ప్రింటర్లు, ఐదు ద్విచక్ర వాహనాలు, 433 వాహన ఆర్సీలు, లైసెన్స్ కార్డులు, రబ్బర్ స్టాంప్ లు, నకిలీ భీమా పత్రాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
ఇందులో ఆర్టీఏ అధికారులు ప్రమేయం వుందా అనే కోణంలో అరా తీస్తున్నాం అని తెలిపారు.
నిందితుల్లో మామిడి రాజు, ఉమ్మడి నిఖిల్, నాగమల్ల శివ ప్రసాద్, అల్లడి రాజేష్ గుండెబోయిన శ్రీకాంత్ లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు దళారులు రాజకుమార్, బొల్లినేని సుమన్, ఆర్టిఏ కార్యాలయంలో డీబీఏలుగా పనిచేస్తున్న శ్రీనివాస్, రఘు తోపాటు గతంలో పనిచేసిన సునీల్ పరారయ్యారు. నకిలీ డాక్యుమెంట్స్ తయారు చేస్తున్న కంప్యూటర్ సెంటర్స్ నుంచి పెద్ద ఎత్తున నకిలీ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు, స్మార్ట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Peddi Nizam : పెద్ది నైజాం బుకింగ్స్ ఓపెన్.. కానీ ఆ థియేటర్స్ ఇంకా పెండింగ్
-
Pandu Master: విశాఖలో రోడ్డు ప్రమాదం.. డాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు!
-
Obsession Collections : 7 కోట్ల బడ్జెట్ తో 1000కోట్లకు పైగా కలెక్షన్లు… బాక్సాఫీస్ లో అదరగొడుతన్న హారర్ థ్రిల్లర్
-
Prabhas : జెట్ స్పీడ్ లో స్పిరిట్ షూట్.. టీజర్ ఎప్పుడంటే?
-
DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!