Site icon NTV Telugu

మరో వివాదంలో ఇరుకున్న ఫేస్‌బుక్‌..

ఫేస్‌బుక్‌ వరుసగా ఏదో ఒక వివాదంలో ఇరుకుంటోంది. ఫేస్‌ బుక్‌ వినియోగాదారుల డాటా లీక్‌ అయ్యిందని లాంటి ఆరోపణలతో పలుమార్లు వార్తల్లో నిలిచింది ఫేస్‌బుక్‌. అయితే వివాదంలో చిక్కకున్న ప్రతి సారి ఆధికంగా నష్టం వాటిల్లడంతో ఫేస్‌బుక్‌ మాతృసంస్థ పేరు మార్చాలని డిసైడ్‌ అయ్యారు.. మెటా గా కూడా నామకరణం చేశారు.

కానీ ఇప్పుడు ఆ పేరు చిక్కులు తెచ్చిపోట్టింది. అమెరికాకు చెందిన ఓ టెక్‌ సంస్థ మెటా కంపెనీ వ్యవస్థాపకుడు నేట్‌ స్క్యూలిక్‌ కోర్టును ఆశ్రయించారు. రీబ్రాండింగ్‌ పేరిట ఫేస్‌ బుక్‌ తమ సంస్థ పేరును దొంగలించిందని ఆరోపిస్తూ.. కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. గతంలో ఫేస్‌బుక్‌ ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించినందుకే ఇలా చేసిందని ఆయన వెల్లడించారు.

Exit mobile version