Site icon NTV Telugu

యూరోపియ‌న్ స్పేస్ ఏజెన్సీ కీల‌క నిర్ణ‌యం: మ‌రో ప‌దేళ్ల‌లో చంద్రునిపై గ్రామం…

మ‌నిషి భ‌విష్య‌త్తులో భూమి మీద నుంచి చంద్రునిమీద‌కు, అంగార‌కుని మీద‌కు వెళ్లేందుకు అవ‌కాశం ఉంటుందా అనే ప్ర‌శ్న‌కు అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు యూరోపియ‌న్ స్పేస్ ఏజెన్సీ శాస్త్ర‌వేత్త‌లు.  అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రం నుంచి చంద్రుని వాతార‌వ‌ణంలోని ప‌రిస్థితులు ఎలా ఉన్నాయి. అక్క‌డ మానవుని నివాసానికి అనుగుణంగా ఉంటుందా లేదా అనే అంశాల‌ను దృష్టిలో పెట్టుకొని ప‌రిశోధ‌న‌లు చేశారు.  చంద్రునిపైన, మార్స్ పైనా ఘ‌నీభ‌వించిన మంచు జాడ‌లు ఉన్నాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు కనుగోన్నారు.  

Read: మరో రికార్డ్ సృష్టించిన మెగా కోడలు..

మంచు ఉందంటే జీవి నివ‌శించేందుకు అనువైన వాతావ‌ర‌ణం ఉండి తీరుతుంద‌ని, ఆ దిశ‌గా ప్ర‌యోగాలు చేస్తున్నారు శాస్త్ర‌వేత్త‌లు.  ప్ర‌స్తుతం చంద్రునిపై కాల‌నీలు ఏర్పాటు చేసే దిశ‌గా ఆలోచ‌న‌లు చేస్తున్నారు.  రాబోయే ప‌దేళ్ల‌లో చంద్రునిపై మ‌నిషి నివ‌శించ‌డానికి అనువుగా గ్రామాల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు యూరోపియ‌న్ స్పేస్ ఏజెన్సీ శాస్త్ర‌వేత్త‌లు ప్ర‌క‌టించారు.  ఇటీవ‌లే ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో నాలుగువేల మంది అంత‌రిక్ష ప‌రిశోధ‌కుల‌తో జ‌రిగిన వార్షిక స‌మావేశంలో యూరోపియ‌న్ స్పేస్ ఏజెన్సీ శాస్త్ర‌వేత్త‌లు ఈ విధ‌మైన ప్ర‌క‌ట‌న చేశారు.  చంద్రునిపై శాశ్వ‌త ఆవాసాల త‌రువాత మార్స్‌పైనా నివాసం ఉండేందుకు ఆవాసాలు ఏర్పాటు చేస్తామ‌ని ప‌రిశోధ‌కులు పేర్కొన్నారు.  

Exit mobile version