Site icon NTV Telugu

నన్ను చంపడానికి కుట్ర చేస్తున్నారు: ఈటల

మాజీమంత్రి ఈటల రాజేందర్ నేడు హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర మొదలుపెట్టారు. ఆయన మాట్లాడుతూ.. అధికార టీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు.

తెలంగాణను కేసీఆర్ రజాకార్ల రాజ్యం చేసిండన్నారు.. ‘దళిత బందు పథకం’ పెట్టారట సంతోషం.. కానీ ఇంతవరకు దళితులకు ఇస్తామన్న 3 ఎకరాలు అమలు కాలేదని, వారి సంక్షేమ కోసం ఏమీ చెయ్యలేదని ఆరోపించారు. కేవలం ఎన్నికల కోసం పథకాలు తీసుకురావద్దు.. రెండేళ్లుగా ఇవ్వని పెన్షన్, రేషన్ కార్డ్ ఇస్తున్నారు. ఫాంహౌస్ లో ఉన్న కేసీఆర్ ను ప్రజల మధ్యకు తీసుకువచ్చినది మనమే అని తెలిపారు.

తన కార్యకర్తలకు అన్నం పెట్టుకోడానికి తెచ్చుకున్న సామానులకు కూడా తాళం వేశారు. భోజన విరామం కోసం బుక్ చేసుకున్న రైస్ మిల్లును సీజ్ చేశారని మండిపడ్డారు. ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి పనులు చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నీచమైన సంస్కృతికి ఇలాంటి ఘటనలు నిదర్శనాలని చెప్పారు.

నన్ను చంపడానికి జిల్లా మంత్రి కుట్ర చేస్తున్నాడు. హంతక ముఠాతో చేతులు కలిపారని నాకు సమాచారం వచ్చింది. అరె కొడకల్లారా! నన్ను నరహంతకుడు నయిం చంపుతా అంటేనే భయపడలేదు. ఈ చిల్లర ప్రయత్నాలకు ఏనాడూ కూడా భయపడం.. ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసిన వాడిని. ఈటల మల్లయ్య కొడుకును, సమ్మన్న తమ్ముణ్ణి ఆనాడే కొట్లడిన వాళ్ళం.. ఆత్మగౌరవం కోసం ఏ స్థాయిలో అయినా కొట్లడతామన్నారు.

దుబ్బాకలో ఎం జరిగిందో అదే ఇక్కడ కూడా జరుగుతుంది. ప్రతి ఇంట్లో నేను ఉన్న, నా ఇంటికి వస్థే ఏ కులం, ఏ మతం అని అడగలే ఏం కష్టం వచ్చింది అని అడిగి సాయం చేశాను. 2018లో ఓడించడానికి ప్రయత్నం చేసినా నా ప్రజలు అండగా నిలిచారు. ఇప్పుడు నిలుస్తారు. చట్టం మీద నాకు విశ్వాసం ఉంది. పోలీసులు సహకరించండి అని ఈటల కోరాడు.

Exit mobile version