NTV Telugu Site icon

బ్రేకింగ్ : ఈటల రాజేందర్ రాజీనామా ఆమోదం..

ఈటల రాజేందర్ రాజీనామాను కాసేపటి క్రితమే తెలంగాణ స్పీకర్ ఆమోదించారు. రాజీనామాని ఆమోదిస్తూ ఫైల్‌పై సంత‌కం చేశారు స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డి. ఇవాళ ఉద‌యం అసెంబ్లీకి ఎదురుగా ఉన్న గ‌న్‌పార్క్ లో తెలంగాణ అమ‌ర‌వీరుల స్థూపం ద‌గ్గ‌ర నివాళుల‌ర్పించిన ఈటల.. అనంత‌రం అసెంబ్లీకి వెళ్లి.. అసెంబ్లీ సెక్ర‌ట‌రీకి త‌న రాజీనామా లేఖ‌ను అంద‌జేశారు.. స్పీక‌ర్ ఫార్మాట్‌లోనే రాజీనామాలేఖ‌ను స‌మ‌ర్పించారు ఈట‌ల రాజేంద‌ర్. ఈటల రాజీనామాపై గంట వ్యవధిలోనే స్పందించిన తెలంగాణ స్పీకర్..వెంటనే ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్ర‌ట‌రీకి కీలక ప్రకటన చేశారు. హుజూరాబాద్ అసెంబ్లీ సీటు ఖాళీ అయినట్లు ప్రకటించారు అసెంబ్లీ సెక్ర‌ట‌రీ. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యం అయింది. హుజూరాబాద్ ఉప ఎన్నికకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. కాగా ఇప్ప‌టికే బీజేపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖ‌రారు చేసిన ఈటల.. ఈనెల 14నవ తేదీన ఢిల్లీలో భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా స‌మ‌క్షంలో.. కాషాయ కండువా క‌ప్పుకోనున్నారు..