ఉద్యోగులకు తీపి కబురు అందించింది కేంద్రం. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)కి సంబంధించిన అంశంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఖరారు చేసింది. పీఎఫ్ వడ్డీ రేటును స్వల్పంగా పెంచి 8.15 శాతానికి చేర్చింది. గతంలో వడ్డీ రేటు 8.10 శాతంగా ఉంది. తాజాగా పెంచిన వడ్డీ రేట్లు 2022-23 పీఎఫ్ డిపాజిట్లపై వర్తిస్తుంది. పీఎఫ్ అకౌంట్‌లో ఉన్న నగదు నిల్వపై ఈ వడ్డీ జమ అవుతుంటుంది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
Also Read: Gold prices: గోల్డెన్ ఛాన్స్ .. తగ్గిన బంగారం ధర.. నేటి రేట్లు ఇవే
2020-21 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ (PF)పై వడ్డీ రేటు 8.5 శాతంగా ఉండేది. కానీ ఎన్నడూ లేని విధంగా గత ఆర్థిక సంవత్సరంలో (2021-22) వడ్డీ రేటును 8.1 శాతానికి తగ్గించారు. గత నాలుగు దశాబ్దాల్లో పీఎఫ్‌పై ఇదే తక్కువ వడ్డీ రేటు. అయితే, ఇప్పుడు మరో 0.05 శాతం మేర పెంచింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల రెండు రోజుల సమావేశం తర్వాత, ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీలో 0.05% పెంచాలని సిఫార్సు చేయాలని నిర్ణయించారు. 2022-23కి వర్తించే కొత్త రేటు 8.15%గా ఉంటుంది.
సీబీటీ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపనున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత వడ్డీ రేటును ఈపీఎఫ్‌ఓ అధికారికంగా నోటిఫై చేస్తుంది. ఆ తర్వాత వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్‌ఓ (EPFO) చందాదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వాత వడ్డీ రేటు అధికారికంగా ప్రభుత్వ గెజిట్ విడుదల అవుతుంది. అనంతరం EPFO తన చందాదారుల ఖాతాల్లో వడ్డీ రేటును జమ చేస్తుందని ప్రభుత్వ ప్రకటన తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం 2021-22తో పోలిస్తే ఆదాయం మొత్తంలో వృద్ధి వరుసగా 16%, 15% కంటే ఎక్కువ అని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
Also Read:Fake certificates: నకిలీ సర్టిఫికెట్ల జారీ స్కాంలో కీలక మలుపు
కాగా, మార్చి 2020లో EPFO ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 2018-19కి అందించిన 8.65% నుండి 2019-20కి ఏడేళ్ల కనిష్ట స్థాయి 8.5%కి తగ్గించింది. EPFO తన చందాదారులకు 2016-17లో 8.65 శాతం, 2017-18లో 8.55 శాతం వడ్డీ రేట్లను అందించింది. 2015-16లో వడ్డీ రేటు కొంచెం ఎక్కువగా 8.8 శాతంగా ఉంది. పదవీ విరమణ నిధి సంస్థ 2013-14, 2014-15లో 8.75% వడ్డీ రేటును ఇచ్చింది. 2012-13కి 8.5% కంటే ఎక్కువ. 2011-12లో వడ్డీ రేటు 8.25 శాతంగా ఉంది.