Site icon NTV Telugu

ఎల‌న్ మ‌స్క్ కీల‌క వ్యాఖ్య‌లు: మ‌రో ఐదేళ్ల‌లోనే మార్స్‌మీద‌కు మ‌నిషి…

స్పేస్ టెక్నాల‌జీ అభివృద్ధి చెందిన త‌రువాత విశ్వంలో ఎక్క‌డికైనా ప్ర‌యాణం చేసేందుకు రాకెట్లు త‌యారు చేస్తున్నారు.  ఇప్ప‌టికే మ‌నిషి చంద్రునిమీద‌కు వెళ్లివ‌చ్చారు.  అయితే, త్వ‌ర‌లోనే చంద్రునిమీద ఆవాసం ఏర్పాటు చేసుకోవడానికి ప్ర‌య‌త్నాలు జరుగుతున్నాయి.  భూమిపై ఇబ్బందులు తెల‌త్తితే మ‌నిషి మ‌నుగ‌డ సాగించేందుకు ఇత‌ర గ్ర‌హాల‌పైకి వ‌ల‌స వెళ్లేందుకు వీలుగా ప్ర‌యోగాలు చేస్తున్నారు.  మ‌రో ఐదేళ్ల‌లో మార్స్ మీద‌కు మ‌నుషుల‌ను పంపుతామ‌ని స్పేస్ ఎక్స్ అధినేత ఎల‌న్ మ‌స్క్ చెబుతున్నారు.  

Read: సోము వీర్రాజు కొత్త డిమాండ్… విశాఖ కేజీహెచ్ పేరు మార్చాలి

దీనికోసం ప్రయోగాలు కొన‌సాగుతున్నాయని, త‌ప్ప‌నిస‌రిగా ఐదేళ్ల‌లో మ‌నిషిని మార్స్ మీద‌కు చేర‌వేసేందుకు అనువైన రాకెట్లు త‌యార‌వుతాయ‌ని ఎల‌న్ మస్క్ పేర్కొన్నారు.   దీనిపై ఎల‌న్ మస్క్ డెడ్‌లైన్ విధించుకున్నారు.   అయితే, ఈ డెడ్‌లైన్‌లోపు మ‌స్క్ అనుకున్న‌ది సాధిస్తారా లేదా అన్న‌ది చూడాలి.  టెస్లా కారు విష‌యంలోనూ, స్పేస్ ఎక్స్ రాకెట్ల విష‌యంలోనూ గ‌తంలో డెడ్‌లైన్స్ పెట్టుకొని అనేక‌మార్లు త‌ప్పిన సంగ‌తి తెలిసిందే.  మ‌రి ఈసారైనా అనుకున్న విధంగా ఎల‌న్ మ‌స్క్ మార్స్ ప్ర‌యోగం స‌క్సెస్ అవుతుందా చూడాలి.  

Exit mobile version