Site icon NTV Telugu

Ed A Mamma Reliance : ఆలియా భట్‌తో అంబానీ రూ.350 కోట్ల ‘బిజినెస్​’ డీల్‌..

Alia Bhatt (2)

Alia Bhatt (2)

బాలివుడ్ నటి ఆలియా భట్ వరుస సినిమాలతో పాటు మరోవైపు పలు వ్యాపారాల్లో రానిస్తుంది.. గతంలో చిల్డ్రన్ వేర్ బ్రాండ్​ను నెలకొల్పిన ఆలియా.. విజయవంతంగా దాన్ని నడిపిస్తున్నారు. అయితే, ఆ దుస్తుల కంపెనీని రిలయన్స్ అధినేత అంబానీ కొనుగోలు చేయనున్నట్లు సమాచారం.. అందుకోసం ఆలియా తో భారీ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది..

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ పలు వ్యాపారాలు చేస్తూ సక్సెస్ ఫుల్ ఉమెన్ గా దూసుకుపోతున్నారు.. ఆమె వ్యాపార విస్తరణలో భాగంగా ఈ డీల్​ ఫైనల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం..రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో భాగమైన రిలయన్స్ బ్రాండ్స్.. ఆలియా భట్​కు చెందిన చిల్డ్రన్ వేర్ బ్రాండ్ ‘ఎడ్-ఎ-మమ్మా’ కంపెనీని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది.. ఈ కంపెనీని రిలయన్స్ రిటైల్​ రూ.300-రూ.350 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ బిజినెస్ డీల్ కు సంబందించిన ఫైనల్ చర్చ జరుగుతుందట.. మరో వారం రోజుల్లో ఈ భారీ డీల్​ గురించి పూర్తి సమాచారం తెలియనుంది..

పిల్లల దుస్తుల విభాగంలో తమ ఉనికిని బలోపేతం చేసుకోవాలని యోచిస్తున్న ఇషా అంబానీ.. ఇప్పటికే పాపులర్‌ అయిన ఆలియా‍ బ్రాండ్‌ను కొనుగోలు చేయాలని భావిస్తున్నారట.. అక్టోబర్ 2020లో ఆలియా భట్.. ఎడ్-ఎ-మమ్మా పేరుతో 2-14 వయసు గల చిన్నారులకు సంబంధించిన డ్రెస్సుల బిజినెస్ ను స్టార్ట్ చేశారు.. ఈ ఏడాది ఆరంభం నుంచి కొత్తగా బాలికలకు దుస్తులు, స్లీప్​ సూట్​లు, బాడీ సూట్​లును కూడా విక్రయిస్తున్నారు. అయితే తన వ్యాప్తారాన్ని మరింతగా విస్తరించాలనుకుంటున్నట్లు కొన్నిరోజుల క్రితం ఆలియా వ్యాఖ్యానించారు. ఈలోపే రిలయన్స్​ కొనుగోలు చేయనుందని వార్తలు రావడం గమనార్హం..గతేడాది ఆగస్టులో రిలయన్స్ రిటైల్ హెడ్‌గా ఇషా అంబానీని ముకేశ్​ అంబానీ నియమించారు. అప్పటికి సంస్థ టర్నోవర్‌ రూ. 2 లక్షల కోట్లు.. జిమ్మీ చూ, జార్జియో అర్మానీ, హ్యూగో బాస్, వెర్సేస్, మైఖేల్ కోర్స్, బ్రూక్స్ బ్రదర్స్, అర్మానీ ఎక్స్ఛేంజ్, బుర్బెర్రీ లాంటి ప్రపంచస్థాయి బ్రాండ్లు మన దేశంలో రిలయన్స్ రిటైల్ తో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి.. ఇక ఆలియా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు..

Exit mobile version