రేపటి నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికోసం ఇంద్రకీలాద్రిని అధికారులు ముస్తాబు చేస్తున్నారు. రేపటి నుంచి 15 వ తేదీ వరకు ఉత్సవాలు జరగబోతున్నాయి. ఈ ఉత్సవాల్లో అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. 9 రోజులపాటు జరిగే ఉత్సవాల్లో లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను నిర్వహించేందుకు అధికారులు సిద్దం అవుతున్నారు. భక్తుల కోసం క్యూలైన్లు ఏర్పాలు చేశారు. కృష్ణానదిలో స్నానాలు చేసే వారికోసం ప్రత్యేకంగా ఘాట్‌లను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ 10 వేల మంది వరకు అమ్మవారిని దర్శనం చేసుకునే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు విహాంగ వీక్షణం చేసేందుకు హెలీకాఫ్టర్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 6 నిమిషాల విహాంగ వీక్షణం కోసం రూ.3500, 15 నిమిషాల విహాంగ వీక్షణం కోసం రూ.6 వేలు వసూలు చేయనున్నారు.
Read: ఆ వెయ్యికోట్లు అమరావతికి వస్తాయా?