ఆ వెయ్యికోట్లు అమ‌రావ‌తికి వ‌స్తాయా?

కేంద్ర ప్రభుత్వం కొత్త న‌గ‌రాల ఏర్పాటుకు సుముఖంగా ఉన్న‌ది.  15 వ ఆర్థిక సంఘం దేశంలోని 8 రాష్ట్రాల్లో 8 కొత్త న‌ర‌గాల‌కు రూ.8 వేల కోట్ల రూపాయ‌ల నిధులు కేటాయించాల‌ని సిఫార‌సు చేసింది.  ఈ సిఫార‌సు మేరకు కేంద్రం కూడా న‌గ‌రాల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్న‌ట్టు ప్ర‌క‌టించారు కూడా.  అయితే, ఇప్పుడు ఆ 8 న‌గ‌రాల్లో అమ‌రావతి కూడా ఉంటుందా లేదా అన్న‌ది తెలియాల్సి ఉన్న‌ది. సుమారు 217 చ‌.కిమీ విస్తీర్ణంలో అన్ని ర‌కాల హంగుల‌తో రూ.40 వేల కోట్ల రూపాయ‌ల అంచ‌నాల‌తో అమ‌రావ‌తి న‌గ‌రాన్ని నిర్మించేందుకు గ‌తంలో ప్లాన్ చేశారు.  ఇందులో భాగంగా ఇప్ప‌టికే సుమారు రూ.10 వేల కోట్ల రూపాయాలు ఖ‌ర్చుచేసి కొన్ని బిల్డింగ్‌లు, రోడ్లు, ఇత‌ర మౌళిక వ‌స‌తులు ఏర్పాటు చేశారు.  అయితే, గ‌త కొంత కాలంగా అమ‌రావ‌తి నిర్మాణం ఆగిపోయింది.  ఇప్పుడు ఈ 8 న‌గ‌రాల్లో అమ‌రావ‌తి కూడా ఉంటే మ‌ళ్లీ న‌గ‌ర నిర్మాణం వేగం పుంజుకుంటుంది.  ఆర్థిక సంస్థ‌లు నిథులు వెచ్చించేందుకు ముందుకు వ‌స్తాయి.  ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు రోడ్లు, బిల్డింగ్‌లు, నీటి స‌ర‌ఫ‌రా, ప‌చ్చ‌ద‌నం వంటివి ఏర్పాటు చేయ‌డంతో త‌ప్ప‌కుండా అమ‌రావ‌తి ఆ 8 కొత్త న‌గ‌రాల జాబితాలో ఉండే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు.  

Read: నేటి నుంచి బతుక‌మ్మ పండ‌గ సంబ‌రాలు…

-Advertisement-ఆ వెయ్యికోట్లు అమ‌రావ‌తికి వ‌స్తాయా?

Related Articles

Latest Articles