కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే పలు దేశాలు వ్యాపరం పరంగా, టూరిజం పరంగా లాసయ్యాయి. కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మరలా విజృంభిస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. బయటకు రావాలంటే భయపడుతున్నారు. కరోనా మహమ్మారి రూపం మార్చుకొని ఎటాక్ చేస్తూనే ఉన్నది. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ భీభత్సం సృష్టిస్తోంది. సార్స్‌కోవ్ 2, డెల్టా వేరియంట్ కంటే వేగంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తుండటంతో ప్రపంచం మొత్తం మళ్లీ అప్రమత్తం అయింది. యూరప్‌లో ఒమిక్రాన్ విలయతాండవం చేస్తున్నది.
Read: న్యూ ఇయర్ మందుతో 1000 కోట్ల ఆదాయం..
ఎటునుంచి ఎటాక్ చేస్తుందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఒమిక్రాన్ నుంచి తాత్కాలికంగా కోలుకున్న దుబాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. దుబాయ్ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్‌ను పూర్తి స్థాయిలో పునరుద్దరించింది. రెండేళ్ల తరువాత పూర్తిస్థాయిలో ఎయిర్ పోర్ట్‌ను పునరుద్దరించడంతో ఒకవైపు ప్రయాణికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా, మరోవైపు కరోనా భయంతో వణికిపోతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుండటంతో ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు. ఎయిర్ పోర్ట్‌ను పూర్తిస్థాయిలో పునరుద్దరించినా, ప్రయాణికులు ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
