రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌లో జరిగిన ఒక ఫెయిర్‌లో డ్రాప్‌టవర్ రైడ్ కుప్పకూలింది. ఈ ఘటనలో 11 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎత్తైన ఊయల అకస్మాత్తుగా నేలపైకి పడిపోయింది. రంగులరాట్నం నడుపుతుండగా, అకస్మాత్తుగా కిందకు ప్రయాణిస్తున్నప్పుడు అది కుప్పకూలింది.
Also Read: ఇండియాలో బిజీయెస్ట్ ఎయిర్‌పోర్టులు ఇవే..
దీంతో అందులో ఉన్నవారు తీవ్ర భయాందోళకు గురయ్యారు. రంగులరాట్నం క్రాష్ అయినప్పుడు ప్రజలు అరుపులు వినబడుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టవర్ రైడ్ యొక్క కేబుల్ విరిగిపోవడంతో అది నేలపై పడటంతో క్రాష్ జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది గాయపడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, వారందరూ ప్రమాదం నుండి బయటపడ్డారు. కేబుల్ తెగిపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. సివిల్ లైన్స్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు అదనపు ఎస్పీ సుశీల్ బిష్ణోయ్ తెలిపారు. స్వింగ్ కేబుల్ తెగిపోవడంతో ఈ సంఘటన జరిగిందని స్పష్టం చేశారు.
ఘటనల అనంతరం స్వింగ్ యజమానిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
Also Read:TDP Ugadi Panchangam: దేశ, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు
కాగా, గత ఏడాది ఇదే విధమైన సంఘటన పంజాబ్‌లోనూ జరిగింది. మొహాలీలో దసరా ఉత్సవంలో ఎత్తైన స్వింగ్ టవర్ కూలిపోవడంతో పిల్లలతో సహా 16 మంది గాయపడ్డారు. మొహాలీలోని ఫేజ్-8లోని దసరా మైదానంలో జరిగిన ఈ ఘటనలో డ్రాప్ టవర్ గా పిలిచే రంగులరాట్నం నేలకు కూలింది. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు సహా దాదాపు 16 మంది గాయపడ్డారు. ఎటువంటి మరణాలు సంభవించలేదు. ఘటనా స్థలంలో ఉన్న ఇతర వ్యక్తులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.