రెండు దశాబ్దాలపాటు ఆఫ్ఘనిస్తాన్‌లో రక్షణ బాధ్యతలు నిర్వహించిన అమెరికా, ఇటీవలే ఆ దేశం నుంచి పూర్తిగా తప్పుకున్నది. అమెరికా దళాలు పూర్తిగా వైదొలిగాయి. పూర్తిగా వైదొలిగిన తరువాత, తాలిబన్లు సంబరాలు చేసుకున్నారు. అమెరికా వదలి వెళ్లిన ఆయుధ సామాగ్రిని తాలిబన్ నేతలు స్వాధీనం చేసుకున్నారు. అవసరమైన ఆయుధాలను, ప్రజలను, సైనికులను తరలించిన అమెరికా, ఎన్నో ఏళ్లపాటు వారితో కలిసి పనిచేసిన జాగిలాలను కాబూల్ ఎయిర్‌పోర్టులోనే వదలి వెళ్లారు. దీంతో ఆ జాగిలాలు ఆకలితో అలమటిస్తున్నాయి. జాగిలాలలను అలా వదిలేసి రావడంపై ప్రపంచం మొత్తం విమర్శలు చేస్తున్నది. అమెరికా అలా చేయడం మంచిది కాదని అంటున్నారు. ఇక, ఇండియా సేనలు వారివెంట కొన్ని జాగిలాలను తీసుకొచ్చారు. ఇక ఇదిలా ఉంటే, వెటరన్ షీప్‌డాగ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఆ జాగిలాలను తిరిగి అమెరికాకు అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. అయితే, కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసి వెళ్లిన జాగిలాలు తమవి కాదని, తమ జాగిలాలను తమ సైనికులు వదలేసి రాలేదని పెంటగాన్ తెలియజేసింది.
ఆ విషయంలో అమెరికా తీరుపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు…
