Site icon NTV Telugu

వంట గ్యాస్ ధరల మంట.. మరో రూ.100 పెరిగే అవకాశం

ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న సామాన్యులకు మరో షాక్ తగలనుంది. రికార్డు స్థాయికి చేరిన వంట గ్యాస్ ధరను చమురు సంస్థలు మరోసారి పెంచేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీపావళికి ముందే గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు 60 శాతం పెరగడంతో.. దేశీయంగా గ్యాస్ సిలిండర్ ధర మరో రూ.100 వరకు పెరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే ధరలు పెరగాల్సి ఉన్నా కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం చమురు సంస్థలు వేచి చూస్తున్నాయి. ప్రభుత్వం అనుమతి రాగానే గ్యాస్ సిలిండర్ ధర పెరగనుంది.

Read Also: పెట్రోల్‌ రూ.120 దాటేసింది.. ఎక్కడంటే..?

కాగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తే అప్పుడు గ్యాస్ ధర పెరిగే అవకాశం ఉండదు. రిటైల్ ధరలను ప్రభుత్వం నియంత్రించగలిగినా.. గ్యాస్ ధరను పెంచకుంటే చమురు మార్కెటింగ్ సంస్థలపై పడే అదనపు భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది. ఒకవేళ ప్రభుత్వం ఒప్పుకుంటే ఈ ఏడాది వంట గ్యాస్ సిలిండర్ ధర పెరగడం ఇది ఐదోసారి అవుతుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే నాలుగు సార్లు వంట గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. వచ్చేవారం గ్యాస్ ధరల పెంపుపై స్పష్టత వచ్చే అవకాశముంది. కాగా హైదరాబాద్​లో గ్యాస్ సిలిండర్ ధర రూ.952 పలుకుతోంది. వైజాగ్​లో సిలిండర్​ ధర రూ.908 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో రూ.899.50 వద్ద, ముంబైలో రూ.899.50గా ధరలు ఉన్నాయి.

Exit mobile version