NTV Telugu Site icon

Khairatabad Ganesh: ఈ ఏడాది ‘బడా గణేష్’ హుండీ ఆదాయం ఎంతో తెలుసా..?

Khairatabad Ganesh

Khairatabad Ganesh

9 రోజుల పాటు పూజలందుకున్న ఖైరతాబాద్ మహా గణపతి.. రేపు గంగమ్మ ఒడికి చేరనున్నారు. అందుకోసం ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి 9 గంటలకు ఖైరతాబాద్ మహా గణనాధుడికి మహా హారతి కార్యక్రమం నిర్వహించి.. 11.30 గంటలకు కలశం పూజ నిర్వహిస్తారు. ఆ తర్వాత.. రాత్రి 12 గంటల లోపు గణనాథుడిని కదిలిస్తారు. రేపు ఉదయం 7 గంటలకే గణేష్ శోభాయాత్ర ప్రారంభం కానుంది. అయితే.. ఈ 9 రోజులు గణనాథుడికి ఘనంగా పూజలు చేశారు. అంతేకాకుండా.. భారీ సంఖ్యలో వచ్చి భక్తులు గణేషుడిని దర్శించుకున్నారు. కేవలం నగరంలో ఉండే వారే కాకుండా.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏపీ నుంచి కూడా గణనాథుడిని దర్శించుకున్నారు.

Memorial Meet: సెప్టెంబర్‌ 21న హైదరాబాద్‌లో సీతారాం ఏచూరి సంస్మరణ సభ..

దర్శనానికి వచ్చిన భక్తులు.. దేవుడికి కానుకలు సమర్పించడం ఆనవాయితీ. ఈ క్రమంలో.. భక్తులు ఈసారి ఖైరతాబాద్ గణేషుడి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. రూ. 70 లక్షలు కానుకల ద్వారా హుండీ ఆదాయం వచ్చినట్లు గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది. అలాగే.. హోర్డింగులు, ఇతర సంస్థల ప్రకటన రూపంలో మరో రూ. 40 లక్షలు సమకూరినట్టు సమాచారం.. అంతేకాకుండా.. ఆన్లైన్ ద్వారా, గణపతి చెంతన ఏర్పాటు చేసిన స్కానర్ల (గూగుల్ పే) ద్వారా కూడా కొంత విరాళాలు వచ్చాయి.. వాటిని లెక్కించాల్సి ఉంది. కాగా.. హుండీ లెక్కింపును సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగనుంది. ఖైరతాబాద్‌లో గణపతి ఉత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి మొట్టమొదటిసారి హుండీ లెక్కింపు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరగడం విశేషం.

Knife Attack: సముద్రం తీరంలో కత్తులతో దాడి.. తీవ్రగాయాలతో వ్యక్తి మృతి

మరోవైపు.. బడా గణేష్‌ను దర్శించుకునేందుకు చివరి రోజు కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. దీంతో వెల్డింగ్, కర్ర తొలగింపు పనులకు ఆటంకం కలుగుతుంది. భక్తులను రోప్ సహాయంతో ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద నుంచి పంపించేస్తున్నారు పోలీసులు. మరోవైపు.. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది.

Show comments