NTV Telugu Site icon

Nasa: అంతరిక్షంలో పెరిగిన పువ్వు.. ఎలా ఉందో తెలుసా..!

Nasa

Nasa

Nasa: అంతరిక్షంలో అద్భుతాన్ని సృష్టించారు శాస్త్రవేత్తలు. అంతరిక్షంలో పెరిగిన అద్భుతమైన పువ్వుల చిత్రాన్ని సోషల్ మీడియాతో పంచుకుంది. కక్ష్యలో పెరిగిన జిన్నియా అనే పుష్పాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు నాసా. అయితే 1970ల నుండి శాస్త్రవేత్తలు అంతరిక్షంలో మొక్కలపై అధ్యయనం చేస్తున్నారు. ఈ ప్రయోగాన్ని 2015లో @ISSలో NASA వ్యోమగామి కెజెల్ లిండ్‌గ్రెన్ ప్రారంభించారు” అని నాసా షేర్ చేసిన పోస్ట్‌లో తెలిపింది.

Read Also: Minister Merugu Nagarjuna: టీడీపీ, జనసేన ఏకమైనా.. బీజేపీ కలిసినా.. అధికారంలోకి వచ్చేది మేమే..

అంతరిక్ష ఉద్యానవనం ప్రదర్శన కోసం మాత్రమే కాదని.. కక్ష్యలో మొక్కలు ఎలా అభివృద్ధి చెందుతాయో తెలుసుకోవడం గురించి అని నాసా తెలిపింది. భూమిలో పండే పంటలను కక్ష్యలో ఎలా పండించాలో అర్థం చేసుకోవడంలో తమకు సహాయపడుతుందన్నారు. అయితే అంతరిక్షంలో పంటలు పండించేందుకు నాసాకు చెందిన శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అంతరిక్ష్యంలో పాలకూర, టొమాటోలు మరియు చిలీ పెప్పర్‌లాంటి ఆకుకూరలు, కూరగాయలను పండిస్తున్నారు శాస్త్రవేత్తలు. వీటితో పాటు మరిన్నీ ఇతర కూరగాయలు, ఇంకా చాలా మొక్కలు రాబోతున్నట్లు పేర్కొన్నారు.

Read Also: Fake Baba: కీచక బాబా బాగోతం బట్టబయలు.. అరెస్ట్ చేసిన పోలీసులు

సోషల్ మీడియాలో ఈ చిత్రాన్ని కొన్ని గంటల ముందు పోస్ట్ చేసారు. ఇది అప్పటినుంచి నుంచి నాలుగు లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. అంతేకాకుండా అంతరిక్ష్యంలో పెరిగిన పువ్వుపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ అందం పెరగడానికి ఎంత సమయం పట్టిందని ఒకరు.. ఆ పువ్వు అద్భుతంగా, అందగా ఉందని మరొకరు. ఇన్ క్రెడిబుల్” అని ఇలా పోస్ట్ లు చేస్తున్నారు.