NTV Telugu Site icon

వేసవిలో వరి వేయద్దు.. తేల్చిచెప్పిన తెలంగాణ సర్కార్‌..

తెలంగాణలోని వరి రైతులు షాక్‌ ఇస్తూ తెలంగాణ సర్కార్‌ ఓ ప్రకటన చేసింది. వేసవిలో వరి వేయద్దని మరోసారి తేల్చిచెప్పింది. దీనిపై మీడియాతో మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. వానకాలం పంటను మాత్రమే తెలంగాణ ప్రభుత్వం కొంటుందని స్పష్టం చేశారు. యాసంగిలో వరి వేస్తే మాత్రం కొనే ప్రసక్తే లేదని ఆయన ఉద్ఘాటించారు.

విత్తనం కోసం మాత్రం వరి వేసుకోవచ్చని ఆయన తెలిపారు. అంతేకాకుండా కామారెడ్డి రైతు మృతిపై విచారణ కోరామని, దయచేసి యాసంగిలో రైతులు వరి వేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేయపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని, దమ్ముంటే తెలంగాణ బీజేపీ నేతలు కేంద్రాన్ని ఒప్పించి వరి కొనుగోలు జరిగేలా చూడాలన్నారు.