బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై అసైన్డ్ భూముల అక్రమణ కేసుపై ఈటల జమున మీడియా మాట్లాడారు. చట్టపరంగానే భూములు కొన్నామని ఈటల జమున వివరించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఈటల జమున మాటలపై స్పందిస్తూ.. సర్వే నంబర్ 130 లో పట్టా ల్యాండ్ లేదని వెల్లడించారు. ఈటల జామున కొనుగోలు చేసిన 3 ఎకరాలు చట్ట విరుద్ధమైన పత్రమని ఆయన అన్నారు. అంతేకాకుండా ఆ భూమి పై ఎలాంటి హక్కు లేని రామరావు దగ్గర నుండి కొనుగోలు చేశారని, రిజిస్ట్రేషన్ చట్ట విరుద్ధమని ఆయన తెలిపారు.
అచ్చంపేట లోని సర్వే నంబర్ 130 లో అక్రమంగా పౌల్ట్రీ షేడ్ లు నిర్మించారని, ఈ భూమిని అక్రమంగా కొనుగుళ్లు చేసి తెల్లకాగిత లావాదేవీల ద్వారా అమ్మకానికి పెట్టినట్టు రికార్డ్ లు ఉన్నాయని ఆయన అన్నారు. భూముల సర్వే సమయంలో జామున హేచరిస్ ప్రతినిధులు హాజరై పంచనామాలో సంతకాలు చేశారని, ఈటల జమున చేసిన ప్రకటన సరైనది కాదని ఆయన అన్నారు. అచ్చంపేటలో 130 సర్వే నంబర్ లో భూమిలేని పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూమిని జమున హేచరిస్ అక్రమంగా అక్రమించుకుందని, సర్వే 81 లో భూమి లేని 7గురికి అసైన్డ్ చేయబడిందని ఆయన తెలిపారు. 2011లోనే ఈ భూమిని నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చబడిందని, ఈ సర్వే నంబర్‌లో 14 ఎకరాల అక్రమంగా అక్రమించారని కలెక్టర్ పేర్కొన్నారు.