Site icon NTV Telugu

అల్లు అర్జున్ భయం లేని హీరో.. అతడు చేసే పాత్రలు ఎవరూ చేయలేరు: ఆర్జీవీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. టాలీవుడ్‌లో భయం లేని హీరో అంటే అల్లు అర్జున్ అంటూ ఆర్జీవీ పేర్కొన్నాడు. రీసెంట్‌గా విడుదలైన ‘పుష్ప’ ట్రైలర్‌ను చూసి ఆయన తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పుష్ప లాంటి పాత్రలు బన్నీ కాకుండా మరెవరూ చేయలేరన్నాడు. రియలిస్టిక్ పాత్రలు చేయాలంటే అల్లు అర్జున్ మాత్రమే పర్‌ఫెక్ట్ అని ఆర్జీవీ కొనియాడాడు.

చిరంజీవి, పవన్ కళ్యాణ్, ర‌జనీకాంత్, మ‌హేష్ బాబు లాంటి హీరోలు కూడా పుష్పరాజ్ లాంటి పాత్రలు చేయ‌లేర‌ని వారిని ట్యాగ్ చేస్తూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు. అంతే కాకుండా ఇలాంటి పాత్రలు చేయ‌గలరా అంటూ వారికి స‌వాల్ విసిరాడు. అలాగే చివ‌రిగా పుష్ప అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్ అంటూ పుష్ప మూవీ ట్రైలర్‌లోని డైలాగ్‌ను పోస్ట్ చేశాడు. కాగా పుష్ప మూవీలో అన్ని రకాల హంగులు ఉంటాయని టీజర్ చూస్తే తెలిసిపోతుందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రెండు నిమిషాల 31 సెకెండ్ల టీజర్‌లో ఉన్న ప్రతి సీన్ కూడా కథ గురించి ఆలోచింపచేసేలా ఉందని కొనియాడుతున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 17న విడుదల కానుంది.

Exit mobile version