Site icon NTV Telugu

విజయ్, వంశీ పైడిపల్లితో దిల్ రాజు సినిమా

దక్షిణాది తారలలో భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ ఉన్న హీరోలలో ఇళయదళపతి విజయ్ ఒకరు. సినిమా సినిమాకు తన పాపులారిటీ మరింతగా పెంచుకుంటూ పోతున్నాడు విజయ్. ఇప్పుడు తన తదుపరి సినిమాని వంశీ పైడిపల్లితో చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు శిరీష్ తో కలసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మించనున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించబోతున్నారు. దీనిని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం విజయ్ 65 వ సినిమాన ‘బీస్ట్‌’ను దిలీప్ నెల్సన్‌తో చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే ఈ చిత్రం ప్రారంభమవుతుంది. ప్రముఖ నటీనటులు, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణలతో ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

Exit mobile version