Site icon NTV Telugu

రేవంత్‌ రెడ్డికి డీజీపీ మహేందర్‌ రెడ్డి కౌంటర్‌..

హుజురాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారంలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై డీజీపీ మహేందర్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. ఎవరి ఫోన్‌లు ట్యాప్‌ చేయట్లేదని.. ఫోన్‌ ట్యాపింగ్‌లపై రేవంత్‌ అసత్య ప్రచారం చేస్తున్నారని మహేందర్‌ రెడ్డి అన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ నిబంధనలనే రాష్ట్రంలో అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. శాంతి భద్రతలు కాపాడేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తున్నామన్నారు.

పోలీస్‌ శాఖలో గ్రూపులు లేవని, అసత్య ప్రచారంలో మమల్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలో నాయకుల ఫోన్లు ట్యాపింగ్‌ అవుతున్నాయని, పోలీసు శాఖ రెండు వర్గాలుగా చీలిందని చేసిన వ్యాఖ్యలపై డీజీపీ మహేందర్‌ రెడ్డి పై విధంగా స్పందించారు.

Exit mobile version