NTV Telugu Site icon

అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

flights ban

అంతర్జాతీయ విమానాలపై మరోసారి నిషేధం పొడిగించింది భారత్‌ ప్రభుత్వం.. సెకండ్‌ వేవ్‌ కేసులో ఇంకా అదుపులోకి రాకపోగా.. కొన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతూ పోతున్నాయి.. ఈ నేపథ్యంలో.. సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఉన్న నిషేధాన్ని పొడిగంచింది కేంద్రం.. అయితే, కార్గో విమాన సర్వీసులకు ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అంతర్జాతీయ షెడ్యూల్డ్ కమర్షియల్ ప్యాసింజర్ ఫ్లైట్‌లపై గతంలో విధించిన నిషేధం ఆగస్టు 31వ తేదీతో ముగియనుండగా.. ఆ నిషేధం ఇప్పుడు సెప్టెంబర్ 30 వరకు పొడిగించబడింది. అర్హత ఉన్న, అధికారికంగా ఎంపిక చేసిన రూట్లలో అంతర్జాతీయ షెడ్యూల్ విమానాలను అనుమతించవచ్చు నని తన సర్క్యులర్‌లో పేర్కొంది డీజీసీఏ.

Show comments